comedy
అయ్యో ఖర్మ!
మంత్రిగా పరాకు పరమేశం గవర్నమెంట్ ఆసుపత్రిని తనిఖీ చేయడానికి వెళ్లాడు. అక్కడ అందరూ ముక్కులో దూది పెట్టుకుని పడుకుని ఉన్నారు. అది చూసి సెక్రెటరీతో, ‘‘చూడు... వాసన భరించలేక ఎట్లా ఉన్నారో’’ అంటూ ముక్కు మూసుకున్నాడు.
దానికి సెక్రెటరీ పరాకు పరమేశం చెవిలో, ‘‘సర్! ఇది మార్చురీ గది’’ అన్నాడు.
అబ్బో!
పరాకు పరమేశం ఎలక్ట్రిక్ షాపుకి వెళ్లి, ‘‘ఒక ఆడ ఫ్యాను, మగ ఫ్యాను ఇవ్వండి’’ అన్నాడు.
షాపు ఓనర్, ‘‘ఏంటీ ఆడా, మగా ఫ్యానా?’’
‘‘అవునయ్యా! ఉషా ఫ్యాను, బజాజ్ ఫ్యాను కావాలి’’ అన్నాడు.
ఐతే జాగ్రత్త మరి!
పరాకు పరమేశానికి లారీ యాక్సిడెంట్ అయింది కానీ పెద్దగా దెబ్బలు తగల్లేదు. పక్కనే సహాయం చేసిన వ్యక్తి, ‘‘ఏం ఫర్లేదు. భయపడకండి’’ అన్నాడు.
పరాకు పరమేశం, ‘‘భయపడక ఏం చేయను. లారీ వెనక సీయూ అని రాసి ఉంది మరి.’’
ఫ్యామిలీ మొత్తం ఇదే వృత్తి!
జైలర్ పరాకు పరమేశం ఒక దొంగతో, ‘‘నిన్ను విడిపించడానికి ఎవరూ లేరా?’’
‘‘సర్! మా వాళ్లందరూ ఇక్కడే ఉన్నారు’’ అన్నాడు దొంగ.
ఆ ఉసురు తగిలిందిలే!
సీరియల్ నటి: అంకుల్! టీవీ సీరియల్స్‌లో నటించి సంపాదించింది దొంగలు దోచుకుపోయారు.
పరాకు పరమేశం: నేను అప్పుడే చెప్పాను-జనాలని కన్నీరు పెట్టిన సంపాదన నిలబడదని.
వార్నీ... ఇదో రకం మోసమా!
షాపు ఓనర్: మీరిచ్చిన 500 నోటు మీద ఆర్.బి.ఐ. గవర్నర్ సంతకం లేదు.
పరాకు పరమేశం: అది గవర్నర్ లీవ్‌లో ఉన్నప్పుడు అచ్చు వేశారు.